రామసముద్రం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

62చూసినవారు
రామసముద్రం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
రామసముద్రం పోలీస్ స్టేషన్ ను మంగళవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ మహేంద్ర తనిఖీ చేశారు. మండలంలో స్థితిగతులు, సరిహద్దులు, అక్రమ రవాణా, నేరాలపై ఎస్ఐ రవి కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎల్లప్పుడు శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అక్రమ రవాణా, కర్ణాటక మద్యం, పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యక్రమాలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్