రామసముద్రం మండలంలో అర్హులైన బీసీలు ప్రభుత్వం మంజూరు చేసే రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో భానుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అర్హులైన బీసీ కులాలు వారు ఫిబ్రవరి 7వ తేదీ లోపల సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. దరఖాస్తులో అర్హతకు సంబంధించిన అన్ని వివరాలు అందజేయాలన్నారు.