మదనపల్లిలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభం

52చూసినవారు
మదనపల్లిలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభం
మదనపల్లిలో శాసనసభ్యులు షాజహాన్ భాష సోమవారం రాత్రి బసిని కొండలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు క్రీడలలో స్ఫూర్తిని నింపే విధంగా షటిల్, క్రికెట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే బసిని కొండ దగ్గర నూతనంగా గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్. సేతు, షంషీర్, అలీ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్