రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో కలసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ఉన్నతాధికారుల తీరుపై మంత్రికి ఫిర్యాదు చేసినట్టు జగన్మోహన్ రాజు చెప్పారు.