రామసముద్రం: విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు

55చూసినవారు
రామసముద్రం: విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు
రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. వైద్యులు ఆసుపత్రిలో రోగులకు సేవ చేయకుండా వ్యక్తిగత రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని, వారిపై విచారణ జరిపి విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు బాధ్యతాయుతంగా సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్