బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న రూ. 2.5 లక్షల విలువగల బంగారు గొలుసు మదనపల్లి బస్సు డిపోలో పనిచేసే మహిళా కండక్టర్ గిరిజమ్మకు దొరికింది. ఆమె దాన్ని టూ టౌన్ సీఐ రామచంద్రకు అప్పగించింది. ఆదివారం సీఐ ఆదేశాలతో ఏఎస్ఐ రమణ, పీసీ మహేష్ బస్సులో గొలుసు పోగొట్టుకున్న తిరుపతి జిల్లా రంగంపేటకు చెందిన శివ కుమార్ ను.. మదనపల్లికి పిలిపించి గొలుసును అప్పగించి, గిరిజమ్మను అభినందించారు.