మదనపల్లెలో నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్చకులు చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అభిషేకం, హోమం, వసంతోత్సవం, తోట ఉత్సవం తదితర కార్యక్రమాల అనంతరం మహాపూర్ణాహుతి, ప్రాకారోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై పట్టణంలోని కోటవీధి, సిపాయి వీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చక్రస్నానం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.