అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ పరిధిలోని మంజునాథ కాలనీలో సోమవారం రాత్రి అనుమాస్పద స్థితిలో మృతి చెందిన యువతి మస్తాని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా సభ్యులు గీతాంజలి, రెడ్డి ప్రసన్న తో కలిసి ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు.