ప్రజలు రెవెన్యూ సమస్యలపై నేరుగా తనతో సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని మదనపల్లి తహసీల్దార్ ధనంజయులు కోరారు. నిమ్మనపల్లి నుండి బదిలిపై వచ్చిన ఆయన శుక్రవారం మదనపల్లి ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరూ పనిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మదనపల్లి ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన ఖాజాబీ నిమ్మనపల్లికి బదిలి అయ్యారు