కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లె మండలం, సీటీఎం సచివాలయం 1 పరిధిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తులడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. భవిష్యత్తులో ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో తెలిపారు.