అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల మెస్ ఛార్జీలు పెంచాలని మంగళవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు నిరసన చేపట్టుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదివే పిల్లల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి విడనాడాలన్నారు. జైల్లో ఉన్న ఖైదీ కన్నా విద్యార్థికి తక్కువ ఛార్జీలు ఇస్తున్నారన్నారు.