మదనపల్లి టీబీ కేంద్రాన్ని శనివారం జిజిహెచ్ పరిధిలోని జిల్లా టిబీ అధికారి శ్రీధర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. టీబి డాట్ సెంటర్ నిర్వహణ ఏ విధంగా ఉంది, యూనిట్ పరిధిలోని టీబీ మందులు వాడుతున్న వారి వివరాలు, గళ్ళ పరీక్ష చేయించుకున్న వారి వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. టీబి విభాగంలో పనిచేస్తున్న వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.