ఐదు జాగ్రత్తలు పాటిస్తే తమ కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవచ్చని జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మదనపల్లి డయాలసిస్ కేంద్రం వైద్యులు డాక్టర్ శాశ్విత తెలిపారు. జిల్లా ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ నందు గురువారం మేనేజర్ బాలు ఆధ్వర్యంలో జాతీయ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిపి, షుగర్, మద్యం, పెయిన్ కిల్లర్, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని ఆమె చూపించారు.