మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కరానికి అధిక ప్రాధాన్యత

71చూసినవారు
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కరానికి అధిక ప్రాధాన్యత
ప్రజా సమస్యలకే అధిక ప్రధాన్యత ఇస్తానని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలోని చీకలబైలులో ఓ చిన్న టి షాపు వద్ద అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. అక్కడున్న సాధారణ ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలు అడిగి తెలుసుకుంటూ, స్వయంగా టి తయారు చేసి వడ్డించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్