మాజీ సైనికుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, డీఎస్‌పీ కొండయ్య నాయుడులను కలిసి వినతి పత్రం సమర్పించారు. వాల్మీకిపురం మండలం పెద్దవంక పల్లికి చెందిన మాజీ సైనికుడు వెంకటాద్రికి చెందిన భూమి కబ్జాకు గురి కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.