మదనపల్లె తహశీల్దార్ ఆఫీసు ఎదుట మంగళవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కృష్ణప్ప మాట్లాడుతూ. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు వెంటనే చేయాలన్నారు. భూ పంపిణీ ముఖ్యమైన సమస్యగా మారిందన్నారు. భూసంస్కరణలు దేశంలో అసంతృప్తిగా మిగిలి పోయాయన్నారు.