మదనపల్లి గొల్లపల్లి రింగురోడ్డు వద్ద ఆదాయపు పన్ను శాఖ నూతన కార్యాలయాన్ని శుక్రవారం తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ వంశీధర్ ప్రారంభించారు. భవనం ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన వంశీధర్ మాట్లాడుతూ అడ్వాన్స్ టాక్స్ ప్రాముఖ్యత గురించి, ప్రాడ్‌లెంట్ రిఫండ్స్ వల్ల వచ్చే చిక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో మదనపల్లి ఆదాయపన్ను శాఖ అధికారి మహమ్మద్ ఫరూక్, సూర్య బాబు నాయక్ పాల్గొన్నారు.