మదనపల్లె అంబేడ్కర్ సర్కిల్ ఎదుట శనివారం తల్లికి వందనం విద్యార్థులందరికీ ఇవ్వాలని నిరసన కార్యక్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ చేపట్టారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధుల విడుదలలో జాప్యాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. తల్లికి వందనం విద్యార్థులకు ఇవ్వడానికి ఎలాంటి షరతులు విధించకూడదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ డిమాండ్ చేశారు.