మదనపల్లె నూతన తహశీల్దార్ గురువారం బాధ్యతలు స్వీకరించిన కిషోర్ కుమార్ రెడ్డికి మండల ప్రజలు భూ సమస్యలు వినిపించుకొన్నారు. ఆ తరువాత వివిధ గ్రామాల నుంచి ఏమ్మెర్వో కార్యాలయానికి ప్రజలు వచ్చి భూ వివాద సమస్యల పై అర్జీలను అందజేశారు. స్పందించిన తహశీల్దార్ సంబంధిత విర్ఓలతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.