మదనపల్లి తాలూకా పోలీసుల తీరును నిరసిస్తూ మృతురాలి బంధువులు ఆదివారం హత్యకు గురైన గంగమ్మ బంధువులు నిరసన తెలిపారు. చంద్ర కాలనీకి చెందిన గంగులమ్మ శనివారం హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతురాలి మనవడు మనోహర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వచ్చి ఆందోళన విరమింప చేశారు.