మదనపల్లె ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు ఎండకు ఎండుతూ. వానకు తడుస్తూ. లక్షల ఖరీదు చేసే వాహనాలు పాడైపోతుండడంతో స్థానిక ప్రజలు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఐ భీమలింగను అన్నమయ్య జిల్లా లోకల్ యాప్ వివరణ కోరగా త్వరలో జిల్లా అధికారుల ఆదేశాలతో వాహనాలకు వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలం వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం
సమకూరుతుందని తెలిపారు.