చిన్న పిల్లలను పనులకు పంపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని మదనపల్లె సీడీపీఓ నాగవేణి శనివారం అన్నారు. చైల్డ్ బెగ్గర్స్, చైల్డ్ లేబర్స్ పైన చైల్డ్ లైన్ అధికారులతో కలిసి మదనపల్లి అమ్మ చెరువుమిట్ట చిత్తూరు బస్టాండు, సంచార ప్రజల గుడారాల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడారు. తాము వినుకొండ మండలం గుంటూరుకు చెందినవారుగా సిపిడిఓకు తెలిపారు. చిన్నపిల్లలని చదివించాలని సిపిడిఓ నాగవేణి తెలిపారు.