ఆటో ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సిఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లి మండలం వలసపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని గ్రానైట్ కంపెనీలో పనిచేసే ధీరజ్(25), కరుణ్(23) అపస్(24) మదనపల్లి కి బైక్ పై వెళ్లి.. తిరిగి ఫ్యాక్టరీ కి వెళుతుండగా బసినికొండ ఆంజనేయ గుడి వద్ద ఆటో ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.