మదనపల్లె: టమాటా ధరలకు రెక్కలు

81చూసినవారు
మదనపల్లె మార్కెట్లో సోమవారం కిలో టమాటా రూ. 27 పలికిందని మార్కెట్ సెక్రటరీ అభిలాశ్ తెలిపారు. స్థానిక మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 1000 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకువచ్చారన్నారు. వాటిలో 10 కిలోల మొదటి రకం రూ. 272, రెండో రకం రూ. 250, మూడో రకం రూ. 220 పలికినట్లు తెలిపారు. ధరలు ఇలాగనే నిలకడగా ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. టమాటా రేట్లు పెరగడం వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్