మదనపల్లె: నాటు సారా తరలిస్తున్న ఇద్దరు అరస్ట్

76చూసినవారు
మదనపల్లె: నాటు సారా తరలిస్తున్న ఇద్దరు అరస్ట్
నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సీఐ భీమలింగ తెలిపారు. నిమ్మనపల్లి మండలం, బురుజుమాదిగపల్లికి చెందిన కె. రవి, దివిటివారిపల్లికి చెందిన చిన్నరెడ్డెప్ప వద్ద 13 లీటర్ల సారా శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ లు జబీవుల్లా, డార్కస్, హెడ్ కానిస్టేబుళ్లు మహమ్మదఆలి, శ్రీనివాసులు, వెంకటేష్, శివరాణి లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్