కురబలకోట మండలం గడ్డెత్తుపల్లెకు చెందిన ధనలక్ష్మి, ఆమె తమ్ముడు గోవర్ధన్ బైకుపై గురువారం మదనపల్లెకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కూటర్ మార్గమధ్యంలోని సీటీఎం నేతాజీ నగర్ వద్దకు రాగానే బైకును టాటా మ్యాజిక్ ఢీకొంది. వెంటనే ఇద్దరు క్రింద పడ్డారు. అక్కడున్నవారు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తాలూకా ఎస్ ఐ చంద్రమోహన్ తెలిపారు.