మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో 11 కె.వి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. లోనికి ఎవరికి అనుమతి ఉండదు. అలాంటి ప్రదేశంలో గడ్డి ముళ్ళ చెట్లు తొలగించడానికి శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులతో సూపర్వైజర్ పని చేయించారు. జరగరానిది జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చుట్టూ ముళ్ళ కంచె ఉన్న ప్రదేశంలో అమాయక పారిశుద్ధ్య మహిళలతో పని చేయించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.