కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లి ఎక్సైజ్ సిఐ భీమలింగ తెలిపారు. గురువారం మదనపల్లి లోని వేంపల్లి క్రాస్ లో ఓ వ్యక్తి కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని సమాచారం వచ్చింది. ఎస్ఐ లు డార్కస్, జబివుల్లా తమ సిబ్బందితో కలిసి వెళ్లి చీకలబైలు గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ సుల్తాన్ ను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.