ధర్మవరం సిఐ తల్లి స్వర్ణ కుమారి హత్య కేసులో ముద్దాయి అనిల్ ను అరెస్టు చేసినట్లు సిఐ కళా వెంకటరమణ గురువారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో సెప్టెంబర్ 23న జగన్ కాలనీ వెంకటేష్, గజ్జల కుంట అనిల్ తో కలిసి బంగారు నగల కోసం అనిల్ ఇంటిలోనే హత్య చేశారు. వెంకటేష్ అరెస్టు కాగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న అనిల్ 24వ తేదీ విషం తాగి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా పోలీసులు అరెస్ట్ చేశారు.