మదనపల్లి: నూతన డీఎస్పీగా మహేంద్ర

59చూసినవారు
మదనపల్లి: నూతన డీఎస్పీగా మహేంద్ర
అసాంఘీక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతానని మదనపల్లిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ మహేంద్ర అన్నారు. శనివారం మదనపల్లి డీఎస్పీగా మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు. గతంలో మదనపల్లిలో పనిచేస్తున్న డీఎస్‌పీ కొండయ్య నాయుడు సీఐడీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ నుంచి వచ్చిన డీఎస్పీ మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్