మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష శనివారం వార్డు బాట కార్యక్రమాన్ని సుబ్బారెడ్డి లేఅవుట్ నుండి ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు వాళ్ళ ఇళ్ళ వద్దకే వెళుతున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకుంటూ ప్రక్కనే ఉన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీలను సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.