నిమ్మనపల్లి మండలంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ కొండయ్యగారిపల్లెకు సమీపంలో పఠాన్ అల్లాబక్షు అనే వ్యక్తి నాటు సారాను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. శుక్రవారం నాటు సారా విక్రయ స్థావరం పై పోలీసులు దాడి చేసి అల్లాబక్షు ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.