నిమ్మనపల్లి మండలంలో ఇటీవల తండ్రి చేతిలో దాష్టీకానికి గురైన బాలికల తల్లి పేరుతో ఇల్లు మంజూరు చేయిస్తానని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష హామీ ఇచ్చారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే షాజహాన్ భాషను కుటుంబం కలిసింది. ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు చేయించి హౌసింగ్ ద్వారా త్వరగా బిల్లులు వచ్చే విధంగా సహాయం చేస్తా అన్నారు. ఆ కుటుంబం నిలబడే దానికి అన్ని విధాల ఆదుకుంటాం ఆన్నారు.