ద్విచక్ర వాహనంలో అక్రమంగా నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు శుక్రవారం మదనపల్లి ఎక్సైజ్ సీఐ భీమ లింగ తెలిపారు. నిమ్మనపల్లి మండలం తవలం గ్రామానికి చెందిన నాగరాజ (29) సామకోట వారి పల్లి నుంచి 30 లీటర్ల నాటు సారా తీసుకొని మోటార్ బైకు లో వస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకొని సారా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.