జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుధవారం మదనపల్లె నియోజకవర్గం పప్పిరెడ్డిపల్లి గ్రామస్తులు శివ రాయల్ ఆధ్వర్యంలో ఎల్ఈడి వాల్ ఏర్పాటుచేసి హెచ్ఎంటీవీ లైవ్ తిలకించి సంబరం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కటౌట్ ముందర పొట్టేలు కొట్టి బాణాసంచా పేలుస్తూ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ ఆనందంతో మునిగి తేలారు.