రామసముద్రం మండలం మానేవారిపల్లి సమీపంలోని మామిడి తోటలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై ఎస్ఐ వెంకటసుబ్బయ్య తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అదుపులోకి తీసుకుని 2కోడిపుంజులు, రూ. 9, 260 స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.