రామసముద్రం: వర్షాలు పడాలని అక్కదేవతల ఊరేగింపు

55చూసినవారు
రామసముద్రం: వర్షాలు పడాలని అక్కదేవతల ఊరేగింపు
రామసముద్రం మండలం దిన్నిపల్లి గ్రామస్థులు శనివారం అక్క దేవతలను ఊరేగించారు. గ్రామంలో పూజలు నిర్వహించి డప్పుల మోతలతో ఊరేగింపుగా గ్రామ పొలిమేర లోకి తీసుకెళ్లి కొలువు తీర్చారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో అక్క దేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్