రామసముద్రం: బదిలీపై వెళ్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు సత్కారం

3చూసినవారు
రామసముద్రం: బదిలీపై వెళ్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు సత్కారం
రామసముద్రం మండలంలోని ఊలపాడు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు వివిధ మండలాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో ఆత్మీయ వేడుకలను నిర్వహించారు. గ్రామంలోని రైతులు, ప్రజలు, ఉద్యోగులను పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఊలపాడు గ్రామంలోని రైతులకు ఐదు సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ఉద్యోగుల సేవలను కొనియాడారు.