మదనపల్లె నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్ లో గురువారం రాత్రి ఘోరరోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన యువకుడు పట్టణంలోని గజ్జలకుంటకు చెందిన నరసింహులుగా గుర్తించినట్లు టూ టౌన్ ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.