నగరి నియోజకవర్గం, కూనమరాజుపాళెంలో వున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు మంగళవారం నాడు పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయాన్నే అమ్మవారికి పంచామృతములతో అభిషేకము గావించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ లక్ష్మీ నారాయణ హోమం జరిపారు. పూర్ణాహుతిలో గీతాశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య కర్పూర నీరాజనాలు సమర్పించారు.