నగరి నియోజకవర్గం విజయపురం మండలం నందు బుధవారం రాత్రి నుండి వర్షం కురవడం మొదలైంది. వర్షాలకు మండలంలోని కాలవలు ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాఠశాలలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు. వర్షానికి తోడు చలి గాలులు వీస్తున్నాయి. చలికి వృద్ధులు, మూగజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.