నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన హరికథ మరియు అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భాగవతారిణి శ్రీ రంజితం గారు మరియు శ్రీమతి తులసీ బాయ్ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తుల నడుమ ఘనంగా జరిగింది.