నిండ్ర మండలం ఎలకాటూరు గ్రామపంచాయతీ లో మంగళవారం ఎంపీడీవో శివప్రసాద్ వర్మ పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.