నగరి: నీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థికి మాజీమంత్రి ప్రశంస

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, విజయపుర మండలం, ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి కుమార్తె జయశ్రీ నీట్ ప్రవేశ పరీక్షలు 95.86 శాతంతో 471 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మాజీ మంత్రి రోజా అభినందించడంతో పాటు తన చదువుకు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని తెలిపారు. దీనితో జయశ్రీ తల్లిదండ్రులు మాజీ మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు