నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెం శ్రీమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. ప్రముఖ హాస్పిటల్ అన్నా గౌరి వైద్యుల ప్రత్యేక శ్రద్ధతో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి తగు సూచనలు సలహాలను మందులను ఇచ్చారు. అన్ని విభాగాలకు సంబంధించిన ప్రముఖ వైద్యులు ఇందులో పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి వచ్చిన వారికి సేవలందించారు