నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. శ్రీమతి అలిమేలు హరికథ, శ్రీమతి తులసీబాయి కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.