జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ మండల అధ్యక్షులు శివలింగం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు నిండ్ర సాయిబాబా గుడి ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నగరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ మెరుపుల మహేష్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరారు.