నీట్ పరీక్షలో నగరి నియోజకవర్గానికి చెందిన ఇ.జయశ్రీ 471 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా ఆదివారం ఆమెను అభినందించారు. మెడిసిన్ చదవడానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. ఇంటర్ చదువుకునే సమయంలోనూ రోజా జయశ్రీకి ఆర్థికంగా సాయం చేశారు.