నగరి పట్టణంలోని పి సి ఎన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ 56వ వార్షిక ఉత్సవంలో సోమవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మీరందరూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం మధ్యాహ్నం భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.