నగరి: మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న నిండ్ర తహసీల్దారు

77చూసినవారు
నగరి: మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న నిండ్ర తహసీల్దారు
నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో వున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మంగళవారం సాయంత్రం నిండ్ర తహసీల్దారు శేషగిరిరావు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఆయనకు శిరోవస్త్రాన్ని ధరింపజేశారు. అనంతరం గీతాశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి శాలువాతో సత్కరించారు. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దారు మాధవీలత పాల్గొన్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్